యు.పి: మంటలు ఆర్పు తున్నట్లా? ఎగదోస్తున్నట్లా?
ఉత్తర ప్రదేశ్ లో మరొకసారి మత విద్వేషపు మంటలు రగిలాయి. కాదు, రగల్చబడ్డాయి. బి.జె.పి ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టిందని సమాజ్ వాదీ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ కూడా అదే ఆరోపణలు చేస్తోంది. జరిగిన సంఘటనలు కూడా ఆ వాదనను నిజం చేస్తున్నాయి. బి.కె.యు అనే రైతు సంఘం నిర్వహించిన భారీ బహిరంగ సభలో బి.జె.పి నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లనే భారీ సంఖ్యలో (ఇప్పటివరకూ 40 మంది చనిపోయారని…

