ఆడపిండం హత్యలు విద్యాధిక కుటుంబాలలోనే ఎక్కువ -సర్వే
ఆడపిల్లలను పిండ దశలోనే హత్య చేయడం నిరక్ష్యరాస్య కుటుంబాల కంటే విద్యాధిక కుటుంబాలలోనూ, ధనికుల కుటుంబాలలోనూ అధికంగా జరుగుతున్నాయని భారత దేశంలో జరిగిన ఓ సర్వేలో తేలింది. విద్యాధిక, ధనిక కుటుంబాలు మొదటి బిడ్డ ఆడపిల్ల పుట్టాక రెండవ బిడ్డ ఆడపిల్లే పుట్టబోతున్నదని తెలిస్తే అబార్షన్ చేయించుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. ఇలా రెండో ఆడపిల్లలను పిండ దశలోనే చంపివేయడం విద్యాధికులు, ధనికుల కుటుంబాలలోనే అధికంగా ఉండడం కలవరపరిచే అంశమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్…