ఆంధ్ర ప్రదేశ్ లో రు. 50 వేల కోట్ల భూకుంభకోణం -కాగ్ నివేదిక

2006-2011 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిపిన భూముల కేటాయింపులలో రు.50,285.90 కోట్ల విలువ గల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్రాంతం జరిగిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (సి.ఏ.జి – కాగ్) జరిపిన ఆడిట్ లో తేలింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజుల రాష్ట్ర ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల దాడి నుండి తప్పించుకోవడానికి, పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్ధలో ప్రజా వ్యతిరేక అవినీతి చర్యలను స్క్రూటినీ…