యు.పి.ఎస్.సి: భాష రాజకీయాల జీనీ వదిలారా? -కార్టూన్

సివిల్స్ పరీక్షల్లో మూడేళ్ళ క్రితం ప్రవేశపెట్టిన CSAT (Civil Services Aptitude Test) ప్రశ్న పత్రంపై మరోసారి రగడ రేగింది. హిందీ ప్రాంతాల వాళ్ళు ప్రధానంగా ఈ ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. ఆంగ్లేతర మాధ్యమాలలో పరీక్ష రాసేవారికి వ్యతిరేకంగా కుట్ర చేశారని, గ్రామీణ నేపధ్యం ఉన్న వాళ్ళను ఉన్నత స్ధాయిలకు రాకుండా అడ్డుకునేందుకే ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పరీక్షించే భాగాన్ని ప్రవేశపెట్టారని వారు విమర్శిస్తున్నారు. త్వరలో జరగబోయే సివిల్స్ పరీక్షలను వాయిదా వేసి తమ సమస్యలను పరిష్కరించాలని…