భార్యల మార్పిడి, వరకట్నం, అత్యాచారం: నేవీలో సాంస్కృతిక పతనం!
ఉన్నత స్ధాయి పరీక్షలు నిర్వహించి నౌకాదళ అధికారులను ఎన్నుకుంటారు. ఉన్నత విద్యార్హతలు ఉంటేనే ఈ పరీక్షలలో నెగ్గడం సాధారణంగా సాధ్యపడుతుంది. అలాంటి అధికారులు సాంస్కృతిక జీవనంలో భారత సమాజానికి ఆదర్శంగా ఉండేలా జీవిస్తారని ఆశిస్తాము. ఆధునిక సమానతా విలువలను ఒంటబట్టించుకుని స్త్రీలకు తగిన గౌరవ, మర్యాదలు ఇస్తారని ఊహిస్తాము. కానీ అలాంటి ఊహలకు, ఆశలకు తాము అర్హులము కాదని నౌకాదళ అధికారులు కొందరు చెప్పదలుచుకున్నట్లు కనిపిస్తోంది. ఉన్నతాధికారి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆర్మీ చట్టాల ప్రకారం…