భారత సముద్ర జలాల్లో సాయుధ బ్రిటిషర్ల అరెస్టు

భారత సముద్ర జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన ఒక ఓడను ఇండియా అదుపులోకి తీసుకుంది. తమిళనాడులోని ట్యుటుకోరిన్ వద్ద సియర్రా లియోన్ దేశం జెండాతో ఉన్న ఈ ఓడలో అత్యాధునిక ఆయుధాలు ధరించిన బ్రిటిషర్లు ఉన్నారు. వారితో పాటు ఎస్తోనియా, ఉక్రెయిన్, భారత్ జాతీయులు కూడా ఉన్నారని తెలుస్తోంది. సియర్రా లియోన్ జెండా ఉన్నప్పటికీ ఓడ వాస్తవానికి ఒక అమెరికా కంపెనీకి చెందినది. ఓడలో అత్యాధునిక ఆయుధాలు ఉండడంతో అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నట్లు భారత అధికారులు అనుమానిస్తున్నారు.…