తెరచాప కడితే హెలికాప్టర్ ఎగురుతుందా? -కార్టూన్

దేశాల విదేశాంగ విధానాలకు ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి. అందులో సందేహం లేదు. కానీ ప్రజల ప్రయోజనాలు ఏమిటన్నదీ సంకుచిత, స్వల్పకాలిక స్వార్ధ పూరిత ఎత్తుగడలు నిర్ణయించరాదని ఈ కార్టూన్ లో ‘ది హిందూ‘ కార్టూనిస్టు కేశవ్ చెబుతున్నారు. బహుశా శ్రీలంక మానవ హక్కుల తీర్మానం, కాశ్మీరులో భారత్-పాక్ సైనికుల ఘర్షణలు, (ఇటలీ మెరైన్ల వ్యవహారం కూడానా?) కార్టూనిస్టు దృష్టిలో ఉన్నాయనుకుంటాను. ఎల్.టి.టి.ఇ తో పోరాటం గెలిచిన చివరి రోజుల్లో శ్రీలంక సైన్యం తమిళ…

ఇరాన్ అధ్యక్షుడి సందర్శన వార్త అమెరికాకి ముందుగా తెలిపిన భారత అధికారులు -వికీలీక్స్

ఇరాన్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్న విషయం భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వశాఖలకు తెలపడానికి ముందు అమెరికా రాయబారికి భారత విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేసిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయ్యింది. ఏప్రిల్ 29, 2008 తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ఇండియా రానున్నాడని కొత్తఢిల్లీ లోని అమెరికా రాయబారి కార్యాలయంలో ఉండే రాజకీయ విభాగాధిపతికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ లొని ఓ సీనియర్ అధికారిణి సమాచారం ఇచ్చినట్లుగా రాజకీయ…