భారత ప్రయాణీకుల ఉమ్మడి ఆత్మ ‘భారత రైల్వే’ -ఫొటోలు

‘ఇండియన్ రైల్వేస్’ కి భారత దేశ ప్రయాణీకుల అంతరంగంలో ఉత్కృష్ట స్ధానం ఉంది. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ లక్షల కొద్దీ పల్లెలనూ, పట్నాలనూ కలుపుతూ వ్యాపించిన భారత రైల్వేలు లేకుండా భారతీయుడికి రోజు గడవదు. భారత దేశంలో ప్రజలకు జీవనాడిగా ఉన్న వేల కొద్దీ వృత్తులూ, ఉద్యోగాలూ ఏదో ఒక రూపంలో రైల్వేలతో సంబంధం లేకుండా లేవు. అది ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం ఐనా, ప్రవేటు కంపెనీ సమకూర్చిన ఉద్యోగం అయినా, స్వయం ఉపాధి అయినా……