ఆర్ధిక వృద్ధి అంచనా తగ్గించుకున్న భారత ప్రభుత్వం
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం గతంలో వేసిన ఆర్ధిక వృద్ధి (జిడిపి వృద్ధి రేటు) అంచనాను తగ్గించుకుంది. పనిలో పనిగా ఈ సంవత్సరం కోశాగార లోటు (ఫిస్కల్ డెఫిసిట్ లేదా బడ్జెట్ డెఫిసిట్) లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. “చెల్లింపుల సమతూకం” (బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్) విషయంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నామని తెలిపింది. ‘చెల్లింపుల సమతూకం సంక్షోభం’ ఎన్నడో ఇరవై సంవత్సరాల క్రితం 1992 లో ఇండియా ఎదుర్కొంది.…