భారత వృద్ధి: పరిశ్రమలు బలహీనం, పెట్టుబడులు కరువు
భారత దేశ అభివృద్ధి కధ ఎప్పటికయినా పునరుద్ధరించబడేనా? 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం ముందు వరకు సగటున 9 శాతం జి.డి.పి వృద్ధి రేటుతో పశ్చిమ పెట్టుబడులకు చైనా తర్వాత ఫేవరెట్ గా నిలిచిన ఇండియా ఇప్పుడు అందులో సగం వృద్ధి సాధించడానికి కూడా ఆపసోపాలు పడుతోంది. ‘ఫాస్ట్ ట్రాక్’ పేరుతో స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులకు అనుమతులను భారత చట్టాలను బుల్ డోజ్ చేస్తూ జారీ చేస్తున్నా ఆర్ధిక వ్యవస్ధలో మునుపటి కళ గోచరించడం…

