పాక్ ద్వేషులకు దుర్వార్త, భారత్ పాక్‌లు వాణిజ్య బంధం పటిష్టం చేసుకుంటున్నాయి

ఇది మన పొరుగు దేశం పాకిస్ధాన్‌ను అకారణంగా ద్వేషించేవారికి నిజంగా దుర్వార్తే. భారత్, పాకిస్ధాన్ దేశాలు తమ మధ్య వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాణిజ్య బంధాలను పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లయితే అటువంటి చర్యలు ఇరు దేశాలు భవిష్యత్తులో మరింత సమీప సంబంధాలను అభివృద్ధి కావడానికి దోహదపడతాయని రెండు దేశాలు భావిస్తున్నాయి. పాకిస్ధాన్ వాణిజ్య మంత్రి ‘మక్దూమ్ అమిన్ ఫాహిమ్’ ప్రస్తుతం ఆరు రోజుల ఇండియా పర్యటనలో ఉన్నాడు.…