విషమ షరతుల భారత్ అప్పు, ప్రాజెక్టుల రద్దు యోచనలో బంగ్లాదేశ్
భారత ప్రభుత్వం ఇస్తున్న అప్పుతో పాటు అది విధించిన విషమ షరతులను అమలు చేయలేక బంగ్లాదేశ్ ఏకంగా ఎనిమిది ప్రాజెక్టులను రద్దు చేసుకోవడానికి సిద్ధపడుతోంది. బంగ్లాదేశ్ లో చౌకగా దొరికే ఇసుక, ఇటుకలను కూడా భారత దేశంనుండే దిగుమతి చేసుకోవాలను భారత ప్రభుత్వం షరతులు విధించడంతో దానికంటే ప్రాజెక్టులు రద్దు చేసుకోవడమే మేలని బంగ్లాదేశ్ ప్రభుత్వం తలపోస్తున్నది. ఇదే రకమైన అప్పుల్ని అమెరికా, యూరప్ లనుండి తీసుకుని ఆ అప్పుల భారాన్ని ప్రజలపై మోపిన భారత ప్రభుత్వాలు…
