‘భగవద్గీత’ నిషేధానికి రష్యా కోర్టు నిరాకరణ
భారత ప్రభుత్వం రాయబార పరంగా తెచ్చిన ఒత్తిడి ఫలించిందో ఏమో గానీ ‘భగవద్గీత’ అనువాద గ్రంధం నిషేధానికి రష్యాలోని సైబీరియా కోర్టు నిరాకరించిందని పి.టి.ఐ వార్తా సంస్ధను ఉటంకిస్తూ ఎన్.డి.టి.వి తెలిపింది. సైబీరియాలోని టామ్స్క్ జిల్లా కోర్టులో గత జూన్ నెలలో ఈ మేరకు దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిందని పి.టి.ఐ నివేదించింది. గత కొన్ని వారాలుగా ఈ అంశంపై రష్యా, భారత్ ల మధ్య రాయబార పరమైన ఒత్తిడి కొనసాగుతూ వచ్చింది. పార్లమెంటులో సైతం…