జనాగ్రహంలో బర్కినా ఫాసో పార్లమెంటు దగ్ధం -ఫోటోలు
27 యేళ్ళ పాటు తమను పట్టి పీడించిన సో కాల్డ్ ప్రజాస్వామ్య నియంత బ్లైసే కంపోరే, మరో 15 యేళ్లపాటు దేశాన్ని ఏలడానికి ఏర్పాట్లు చేసుకోవడంతో పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న దేశం బర్కినా ఫాసో ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. గురువారం (అక్టోబర్ 30) రాజధాని ఔగాడౌగౌ వీధులను ముంచెత్తుతూ తీవ్ర స్ధాయిలో నిరసన ప్రకటించారు. కంపోరేకు పదవీకాలం పొడిగింపుకు అవకాశం ఇచ్చే చట్టం ఆమోదం పొందకుండా ఉండేందుకు జనం మూకుమ్మడిగా పార్లమెంటుపై దాడి చేశారు. పార్లమెంటు, ఇతర ప్రభుత్వ…