సెల్ ఫోన్‌తో కేన్సర్ -ప్రపంచ ఆరోగ్య సంస్ధ

ప్రపంచం మొత్తం ఇష్టంగా వాడుతున్న సెల్ ఫోన్‌తో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (World Health Organisation – WHO) హెచ్చరించింది. ఈ విషయం నిర్ధారించడానికి సంస్ధ ప్రత్యేక పరిశోధనలేవీ చేయనప్పటికీ ఇప్పటికే ప్రపంచంలోని వివిధ సంస్ధలు చేసిన పరిశోధనలను క్రోడీకరించిన డబ్ల్యు.హెచ్.ఓ సెల్ ఫోన్ ని అతిగా వాడ్డం వల్లా, చెవికి దగ్గరగా పెట్టుకుని వాడడం వలనా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రమాదానాన్ని నివారించడానికి సెల్ ఫోన్‌ని చెవి…