ఇంగ్లండును అధిగమించిన బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ
ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న ఇంగ్లండును బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధ అధిగమించింది. ఇప్పటివరకు ఏడవ స్ధానంలో ఉన్న బ్రెజిల్ బ్రిటన్ ని ఆరవ స్ధానం నుండి కిందికి నెట్టి ఆ స్ధానానికి చేరుకుందని ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ బిజెనెస్ రీసర్చ్’ (సి.ఇ.బి.ఆర్) తెలిపింది. ఈ సంస్ధ తాజాగా వెలువరించిన ‘వరల్డ్ ఎకనమిక్ లీగ్ టేబుల్’ లో ఆసియా దేశాలు పై స్ధానాలకు చేరుతుండగా, యూరప్ దేశాలు కింది స్ధానాలకు చేరుతున్నాయన కూడా తెలిపింది.…