నార్వే ఊచకోత నిందితుడికి ఇంగ్లండ్ రైటిస్టు తీవ్రవాదులతో సంబంధాలు?!
నార్వే ఊచకోతతో యూరప్ ఉలిక్కిపడింది. తమ దేశాల్లొ రైటిస్టుల గురించి ఆరా తీయడం ప్రారంభిస్తున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జంట దాడుల్లో 92 మందిని ఊచకోత కూసిన ఏండర్స్ బెహ్రింగ్ బ్రీవిక్, తనకు ఇంగ్లండులోని రైటిస్టు తీవ్రవాద సంస్ధలతో సంబంధాలున్నాయని చెప్పడంతో స్కాట్లండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా “ఇంగ్లీష్ డిఫెన్సు లీగ్” (ఇ.డి.ఎల్) సంస్ధతొ తనకు గట్టి సంబంధాలున్నాయని బ్రీవిక్ తెలిపాడు. ఇ.డి.ఎల్ సంస్ధ కూడా ముస్లిం వ్యతిరేక సంస్ధ. వలసదారులను వ్యతిరేకిస్తుంది. బహుళ సంస్కృతి…