ఇరాన్ లో బ్రిటిష్ రాయబార కార్యాలయం విధ్వంసం -ఫొటోలు

ఇరాన్ పైన మరోవిడత అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలను విధించినందుకు ప్రతీకారంగా ఇరాన్ విద్యార్ధులు రాజధాని టెహ్రాన్ లో గల బ్రిటిష్ రాయబార కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కొద్ది వారాల క్రితం ‘అంతర్జాతీయ అణు శక్తి సంస్ధ’ (ఐ.ఎ.ఇ.ఎ) ఇరాన్, 2001లో, అణు బాంబుని నిర్మించడానికి ప్రయత్నించిందనడానికి ఆనవాళ్ళు దొరికాయంటూ ‘అభూత కల్పనలతో’ కూడిన నివేదిక ప్రచురించింది. ఐ.ఎ.ఇ.ఎ అంటె అమెరికా తొత్తు సంస్ధ. అమెరికా గీసిన గీత దాటదు. అమెరికాలో సౌదీ అరేబియా రాయబారిని…