కాబూల్‌లో బ్రిటిష్ కౌన్సిల్ పై తాలిబాన్ దాడి, ఎనిమిది మంది మరణం

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో తాలిబాన్ మిలిటెంట్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. 1919 లో బ్రిటన్ నుండి ఆఫ్ఘనిస్ధాన్ స్వాతంత్రం సంపాదించుకున్న రోజునే బ్రిటిష్ కౌన్సిల్ పై దాడి జరగడం విశేషం. దాడికి తామే బాధ్యులుగా తాలిబాన్ ప్రకటించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య ఉండే కాబూల్ లో అడుగడుగునా చెకింగ్ ఉన్నప్పటికీ మిలిటెంట్లు విజయవంతంగా దాడులకు పాల్పడడం కొనసాగుతున్నది. నాటో బలగాలకు ఇది అవమానకరంగా పరిణమించినప్పటికీ అవి తాలిబాన్ దాడులను అరికట్టడంలో విఫలమవుతున్నాయి. పేరు…