ఇంగ్లండులో భారతీయ విద్యార్ధి హత్య, రేసిజమే కారణం?
విహార యాత్రకి వెళ్ళిన భారతీయ విద్యార్ధి ఇంగ్లండులో హత్యకు గురయ్యాడు. లాంకాస్టర్ యూనివర్సిటీ లో ఎలక్ట్రానిక్స్ లో పి.జి చదువుతున్న ఇరవై మూడేళ్ళ విద్యార్ధి సాల్ ఫోర్డ్ (గ్రేటర్ మాంఛెస్టర్) సందర్శనకు వెళ్ళగా అక్కడ ఓ బ్రిటిష్ వ్యక్తి దగ్గరినుండి కాల్చి చంపాడు. సంఘటన సోమవారం తెల్లవారు ఝాముల జరిగింది. పోలీసులు ఈ ఘటన రెచ్చగొట్టబడిన కారణాలు ఏవీ లేకుండానే జరిగిందని చెప్పారు. అయితే జాతి విద్వేషంతో ఈ హత్య జరిగిందా, లేదా అని చెప్పడానికి వారు…