పాపం అంతా యూరోజోన్‌దే -నిరుద్యోగం పై బ్రిటన్ ప్రభుత్వం

కన్సర్వేటివ్ ల నాయకత్వంలోని కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ నిరుద్యోగం పాపం అంతా యూరోజోన్ సంక్షోభందేనని చేతులు దులుపుకుంది. బ్రిటన్ లో నిరుద్యోగం పెరగడానికి దేశీయంగా ప్రభుత్వ రంగం, ప్రవేటు రంగం, ఛారిటి రంగాల నిర్వాకాలే కారణమని సి.ఐ.పి.డి నివేదిక చెబుతుండగా ట్రెజరీ కి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న మార్క్ హోబన్ మాత్రం పాపం అంతా యూరోజోన్ సంక్షోభంపైకి నెట్టేసి దులుపుకున్నాడు. యూరప్ లో 27 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ గా ఏర్పడ్డాయి.…

బ్రిటన్ లో దారుణ స్ధితికి చేరుకున్న నిరుద్యోగం

యూరప్ రుణ సంక్షోభం బ్రిటన్ పైన దారుణంగా ప్రభావం చూపుతోంది. ఉపాధి అవకాశాలు అక్కడ పూర్తిగా పడిపోయాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. పబ్లిక్, ప్రవేటు రెండు రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. పొదుపు ఆర్ధిక విధానాల పేరుతో ప్రభుత్వరంగాన్ని ప్రవేటుపరం చేస్తుండడంతో ప్రభుత్వరంగంలో ఉపాధి అవకాశాలు ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. కంపెనీలు ఉద్యోగులను నియమించే ఆలోచనే పెట్టుకోవడం లేదు. ఒకరిద్దరూ ఎవరైనా నియామకాలకు పూనుకున్నా, యూరప్ లోని తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలను రద్దు చేసుకుంటున్నారు. పైగా…

బ్రిటన్‌ యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, అల్లర్లకు అదే కారణం

బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం అక్కడ నిరుద్యోగం భూతం జడలు విప్పింది. ప్రభుత్వరంగం ఉద్యోగులను తొలగిస్తుండంతో పాటు ప్రవేటు రంగ ఉత్పత్తి స్తంభించిపోవడంతో నిరుద్యోగం పెరుగుతున్నదని భావిస్తున్నారు. లండన్ తో పాటు ఇతర నగరల్లోని పేద కుటుంబాల యువకులు కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడిన నేపధ్యంలో వెలువడిన ఈ వివరాలు అల్లర్లకు కారణమేమిటో చెప్పకనే చెపుతున్నాయి. రాజకీయ నాయకులు, కార్పొరేట్ మీడియా కూడబలుక్కుని అల్లర్లకు, నిరుద్యోగం కారణం కాదంటూ నమ్మబలుకుతున్నప్పటికీ వాస్తవాలు…