బ్రిటన్ ను మళ్ళీ ఊపేసిన తుఫాను, మరొకటి తయారు -ఫోటోలు

రెండు నెలలుగా ఎడతెరిపి లేని మంచు తుఫానులతో, వర్షాలతో, వరదలతో తడిసి ముద్దయిన ఇంగ్లండ్ ను బుధవారం నుండి శుక్రవారం వరకు మరో తుఫాను ఊపేసింది. 108 కి.మీ వేగంతో వీచిన గాలులకి పశ్చిమ, నైరుతి ఇంగ్లండ్ ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కురుస్తున్న వర్షాన్ని ఇముడ్చుకోవడానికి భూగర్భంలో ఇక ఖాళీ లేదనీ వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా అనేక కాలనీలు, నగరాలు, పల్లెలు, రోడ్లు జలమయమై విశాలమైన తటాకాలను తలపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలలోనే అత్యధిక వరదలు…

బ్రిటన్ తీరాల్ని ముంచెత్తిన పెను తుఫాను

బ్రిటన్ ను పెను తుఫాను వణికిస్తోంది. తుఫాను ఫలితంగా 30 అడుగుల ఎత్తున అలలు విరుచుకుపడుతున్నాయి. దానితో తీర ప్రాంత నగరాలు నీటి సముద్రాలుగా మారాయి. అనేక చోట్ల రోడ్లు తెగిపోగా రేస్ కోర్సులు, మైదానాలు, స్టేడియంలు సైతం నీటితో నిండిపోయాయి. దక్షిణ, పశ్చిమ తీరాలు ప్రధానంగా పెను తుఫాను తాకిడికి గురవుతున్నాయి. తుఫాను తీవ్రత తగ్గలేదని సోమవారం వరకు కొనసాగుతుందని పర్యావరణ శాఖ తెలిపింది. ఇంగ్లాండ్ వ్యాపితంగా 100 కుపైగా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి.…