జలియన్‌వాలా బాగ్: క్షమాపణకు బ్రిటిష్ ప్రధాని నిరాకరణ

అమృత్ సర్ లోని జలియన్‌వాలా బాగ్ ను సందర్శించిన బ్రిటిష్ ప్రధాని కామెరూన్ నాటి మారణకాండకు క్షమాపణ చెప్పడానికి మాత్రం నిరాకరించాడు. మాజీ బ్రిటిష్ ప్రధాని చర్చిల్ చెప్పినట్లే మొక్కుబడిగా విచారం ప్రకటించి ఊరుకున్నాడు. కుంటిసాకులు చెప్పి క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. తాను బ్రిటన్ దేశ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి అన్న విషయం మరిచి ‘జలియన్‌వాలా బాగ్ దుర్మార్గం’ జరిగినప్పటికి తాను అసలు పుట్టనే లేదని అసందర్భ వ్యాఖ్యలు చేసి తప్పించుకున్నాడు. హిల్స్ బరో ఫుట్…