బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ?
– బ్రిక్స్ కూటమి 16వ సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు పుటిన్ కు బ్రిక్స్ కరెన్సీ పేరుతో ఒక నమూనా నోట్ ను బహూకరించటం ఇండియాలో కలకలం రేగటానికి కారణం అయింది. కరెన్సీ నోట్ నమూనా పైన భారత దేశం తరపున భారత జాతీయ పతాకంతో పాటు తాజ్ మహల్ బొమ్మ కూడా ఉండటం ఈ కలకాలానికి ప్రధాన కారణం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 2014 లో అధికారం చేపట్టిన తర్వాత వివిధ ముస్లిం మత నిర్మాణాలకు,…
