ఒక ఆదేశం, కొన్ని ప్రశ్నలు -ది హిందు ఎడిట్..
సామాజిక మరియు సైద్ధాంతీక సమస్యలపై ఒక విద్యార్ధి సంస్ధ చేపట్టిన చురుకైన అవగాహన ఆధారంగా ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ పాలన కింద నడిచే పేరు ప్రతిష్టలు కలిగిన ఓ సంస్ధ అధికారులు ఆ విద్యార్ధి సంస్ధ గుర్తింపును రద్దు చేయడానికి నిర్ణయిస్తే గనుక అపుడా ప్రతిష్టాత్మక సంస్ధ వైఖరిలోనే ఏదో తీవ్రమైన దోషం ఉన్నట్లే. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ లోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ (ఎ.పి.ఎస్.సి) ‘బ్రాహ్మణీయ పీడన’ ను తొలగించాలని పిలుపు…
