వాళ్ళు నా కుటుంబాన్ని సాధిస్తారు, అదే నా భయం -స్నోడెన్ ఇంటర్వ్యూ

అమెరికా రహస్య గూఢచార సంస్ధ ‘నేషనల్ ఇన్వేస్టిగేటివ్ ఏజన్సీ’ (ఎన్.ఐ.ఎ) అక్రమాల గుట్టు విప్పిన ఎడ్వర్డ్ స్నోడెన్ ది గార్డియన్ పత్రిక విలేఖరులు గ్లెన్ గ్రీన్ వాల్డ్, ఎవెన్ మకాస్కిల్ లకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ది హిందు పత్రిక మూడు రోజుల క్రితం దీనిని పునర్ముద్రించింది. తాను ఎందుకు ఎన్.ఎస్.ఎ అక్రమాలను బైటపెట్టవలసి వచ్చింది, ఆర్ధికంగా ఉన్నతమైన తన ప్రామిసింగ్ కెరీర్ ని ఎందుకు వదులుకున్నదీ ఆయన ఇందులో వివరించారు. ఉగ్రవాదం కొత్తగా పుట్టిందేమీ కాదనీ,…

ఎడ్వర్డ్ స్నోడెన్: ప్రిజం లీక్ చేసింది సి.ఐ.ఎ కాంట్రాక్టరే

అమెరికన్ మిలటరీ గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఎ, ప్రపంచ ప్రజల రోజువారీ ఇంటర్నెట్, మొబైల్ కమ్యూనికేషన్లపై నిఘా పెట్టడానికి అభివృద్ధి చేసిన ‘ప్రిజం’ కార్యకలాపాల గురించి ‘ది గార్డియన్’, ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలకు వెల్లడి చేసింది సి.ఐ.ఎ మాజీ కాంట్రాక్టరేనని గార్డియన్ పత్రిక వెల్లడి చేసింది. సి.ఐ.ఎ కాంట్రాక్టర్ గా పని చేసి, అనంతరం ఎన్.ఎస్.ఎ మిలట్రీ కాంట్రాక్టర్ బూజ్ అలెన్ వద్ద ఉద్యోగిగా పని చేస్తున్న ఎడ్వర్డ్ స్నోడెన్ తమకు ‘ప్రిజం’ గురించి సమాచారం ఇచ్చాడని…