చెప్పులు కుట్టే మీకు యూనివర్సిటీ చదువులు కావాలా?

“మీరు హరిజనులు. చదవడానికి, రాయడానికి మీకు హక్కు లేదు. బూట్లు, చెప్పులు కుట్టడమే మీ పని. మా ఇళ్ళలో మిమ్మల్ని దాసులుగా ఉంచుకుంటాం. మీ తాత ముత్తాతలు చేసిన పని అదే. మీరు హాస్టల్ ని వదిలిపెట్టి వెళ్లిపోండి. లేదా, ఇక్కడ రక్తపాతం తప్పదు.” ఏ మారు మూల పల్లెలోనో అహం మూర్తీభవించిన అగ్రకుల భూస్వాములు పలికిన మాటలు కావు యివి. పాట్నా యూనివర్సిటీ విద్యార్ధుల ప్రేలాపనలు ఇవి. పాట్నా యూనివర్సిటీలో షెడ్యూల్డ్ కులాల విద్యార్ధులు నివసించే…

దళిత రక్తం రుచిమరిగిన అగ్ర కుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ ముఖియా’ హత్య

‘బచర్ ఆఫ్ బీహార్’, స్త్రీలు, పిల్లలతో సహా రెండు వందలకు పైగా దళితులను పాశవికంగా చంపేసిన అగ్రకుల దురహంకారి ‘బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా’ శుక్రవారం ఉదయం హత్యకు గురయ్యాడు. ‘మార్నింగ్ వాక్’ కి వెళ్ళిన ముఖియాను గుర్తు వ్యక్తులు సమీపం నుండి తుపాకితో కాల్చి చంపారని ఎన్.డి.టి.వి తెలిపింది. హత్య జరిగిన ‘అర్రా’ పట్టణం ఇప్పుడు కర్ఫ్యూ నీడన బిక్కు బిక్కు మంటోంది. దశాబ్దానికిపైగా బీహార్ అగ్రకుల భూస్వాముల తరపున రాష్ట్రం అంతటా రక్తపుటేరులు పారించిన ముఖియా…

‘దళిత హత్యాకాండ’ కేసులో శిక్షలన్నీ రద్దు చేసిన బీహార్ హై కోర్టు

భారత దేశంలో దళితులకి న్యాయం సుదూర స్వప్నమేనని మరోసారి రుజువయింది. 21 మంది దళితులను, ముస్లింలను బలితీసుకున్న ‘బఠానీ టోలా’ హత్యాకాండ కేసులో బీహార్ హై కోర్టు శిక్షలన్నింటినీ రద్దు చేసేసింది. మంగళవారం నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. సాక్ష్యాలు బలంగా లేవని చెప్పింది. ‘అనుమాన రహితం’గా నేరం రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పింది. కింది కోర్టు ముగ్గురిపై విధించిన ఉరి శిక్షను, మరో 20 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షనూ ఒక్క తీర్పుతో…