భారత్ ను భయపెడుతున్న ఆహార, ఆయిల్ ద్రవ్యోల్బణాలు

భారత దేశానికి ద్రవ్యోల్బణం బెడద మరో సంవత్సరం తప్పేట్టు లేదు. జి.డి.పి వృద్ధి రేటులో చైనా తర్వాత అత్యధిక వేగవంతమైన పెరుగుదలను నమోదు చేస్తున్న ఇండియాకు ద్రవ్యోల్బణం గత ఒకటిన్నర సంవత్సరం నుండి వెంటాడుతోంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం, ఆయిల్ (ఇంధనం) ద్రవ్యోల్బణంలు ఏప్రిల్ 9 తేదితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పెరుగుదలను నమోదు చేసాయి. ద్రవ్యోల్బణం నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం ఎనిమిది సార్లు బ్యాంకు రేట్లను పెంచింది. మార్చితో ముగిసే…

ఇండియా, చైనా, అమెరికాల్లో దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణం

ఇండియా ద్రవ్యోల్బణం తగ్గించడమే మా మొదటి ప్రాధాన్యం అంటూ భారత ప్రధాని నుండి ప్రణాళికా కమిషన్ ఉపాధ్యక్షుడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు వరకూ గత సంవత్సరం ప్రారంభం నుండీ అదే పనిగా ఊదరగోట్టినా, వారి హామీలు కార్య రూపం దాల్చలేదు. తాజా గణాంకాల ప్రకారం ఇండియాలో ద్వవ్యోల్బణం మార్చి నెలలో 8.9 శాతానికి చేరింది. మార్చి నాటికి ద్రవ్యోల్బణాన్ని 5.5 శాతానికి తగ్గిస్తామని ప్రధాని మన్మోహన్, ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా,…