239 మందితో సముద్రంలో కూలిన మలేషియా విమానం?

మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి చైనా రాజధాని బీజింగ్ కు బయలుదేరిన బోయింగ్-777 విమానం ఒకటి సముద్రంలో కూలిపోయినట్లు భయపడుతున్నారు. బయలుదేరిన 40 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు తెగిపోయిన విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దక్షిణ చైనా సముద్రంలో 10 నుండి 15 కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఇంధనం చూసి అనుమానించిన వియత్నాం నావికా దళాల ద్వారా మొదట సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం…