“బొగ్గు నష్టం” నివేదికపై చర్చలు ఇంకా పూర్తి కాలేదు -కాగ్
ప్రవేటు, ప్రభుత్వ కంపెనీలకు బొగ్గు గనులను చౌకగా కేటాయించడం వల్ల కేంద్ర ఖజానాకు రు. 10.67 లక్షల కోట్ల నష్టం వచ్చిందంటూ తాను తయారు చేసిన నివేదిక పై చర్చలు ఇంకా పూర్తి కాలేదని కాగ్ ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నది. చర్చలు పూర్తిగా కాక మునుపే, నివేదికను ఇంకా పూర్తి చేయక ముందే లీక్ కావడం తమను నిశ్చేష్టుల్ని చేసిందని కాగ్ తన లేఖలో తెలిపింది. తాను పేర్కొన్నంత నష్టం వాస్తవానికి సంభవించిందీ లేనిదీ…
