డాలర్ కి వేగంగా తూట్లు పొడుస్తున్న చైనా!
మాయల మరాఠి ప్రాణం ఏడేడు సంద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలోని చిలుకలో ఉన్నట్లుగా అమెరికా ప్రపంచాధిపత్యం, పెత్తనం అంతా ప్రపంచ మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యం లోనే నిక్షిప్తమై ఉన్నది. అమెరికా ఆధిపత్యాన్ని కూల్చాలంటే మార్కెట్ల పైన డాలర్ ఆధిపత్యాన్ని కూలగొడితే చాలు. అమెరికా దుర్గం పేక మేడ లాగా ఇట్టే కూలిపోతుంది. చైనా, రష్యా దేశాలు గత అయిదారేళ్లుగా డాలర్ పెత్తనాన్ని కూల్చేందుకు కృషి ప్రారంభించి మెల్లగానే అయినా స్ధిరంగా ఆ వైపు అడుగులు…

