పొదుపు విధానాలకు తిరస్కరణ, ఇటలీలో హంగ్ పార్లమెంటు

ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు బలవంతంగా అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలను తిరస్కరిస్తూ ఇటలీ ఓటర్లు తీర్పు చెప్పారు. ఆది, సోమ వారాల్లో జరిగిన ఓటింగ్ ఫలితాలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు. కనీసం కూటములు కూడా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయాయి. యూరోపియన్ మానిటరీ యూనియన్ (యూరోజోన్) నుండి వైదొలగాలని ప్రచారం చేసిన కొత్త పార్టీకి మొదటి ప్రయత్నంలోనే పెద్ద ఎత్తున ఓట్లను కట్టబెట్టి ఇటలీ ప్రజలు తమ ఉద్దేశాలు చాటారు. సెంటర్-లెఫ్ట్…