చీప్ లిక్కర్ మృతుల కుటుంబాల్లో అంతులేని విషాధం -ఫొటోలు

పశ్చిమ బెంగాల్, సంగ్రామ్ పూర్ గ్రామంలో విషపూరితమైన చీప్ లిక్కర్ తాగి మృతి చెందినవారి సంఖ్య 167 కి పెరిగింది. మృతులందరూ రిక్షా కూలీలు, తోపుడు బండ్ల వ్యాపారులు, రోజు కూలీలే. వీరి మరణంతో వీరి సంపాదనపై ఆధారపడి ఉన్న కుటుంబాలు భవిష్యత్ ఎలా అని తల్లడిల్లుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ధనిక రోగులు చేరే ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల నష్ట పరిహారం,…

131 మందిని చంపేసిన చీప్ లిక్కర్

ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది చనిపోయి రోజులైనా గడవక ముందే పశ్చిమ బెంగాల్ లో మరో ప్రాణాంతక (ప్రమాదం లాంటి) సంఘటనే జరిగింది. చట్ట విరుద్ధంగా తయారు చేసిన చీప్ లిక్కర్ తాగి 131 మంది జనం చనిపోయారు. దక్షిణ 24 పరగణాల జిల్లా లోని సంగ్రామ్ పూర్ గ్రామం చుట్టు పక్కల జరిగిన ఈ ఘటనలో ఇంకా అనేకమంది మృత్యువుతో పోరాడుతున్నారు. మంగళవారం రాత్రి చీప్ లిక్కర్ సేవించిగా బుధవారం తెల్లవారు ఝాము…