విమోచనా కూడలిలో ఆందోళనకారులను బలవంతంగా తొలంగించిన సైన్యం
ముబారక్ దేశం విడిచి పారిపోయినప్పటికీ కైరో నగరం లోని విమోచనా కూడలిలో కొన్ని వందలమంది ఆందోళనకారులు తమ బైఠాయింపును కొనసాగించారు. ముబారక్ నుండి అధికారం చేపట్టిన సైన్యం ప్రజలు డిమాండ్ చేసినట్లుగా ప్రజాస్వామిక సంస్కరణలు చేపట్టే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని వీరు ప్రతిన బూనారు. వీరిని తొలగించడానికి సైన్యం ప్రారంభంలో ప్రయత్నించినప్పటికీ వారు వెళ్ళలేదు. అయితే మార్చి 9 తేదీన కొన్ని డజన్ల మంది గుర్తు తెలియని వ్యక్తులు విమోచనా కూడలిలో మిగిలి ఉన్న…