16 సం. నాన్ బెయిలబుల్ వారంట్ తప్పించుకొని ఇప్పుడు లొంగిపోయిన బీహార్ ఎం.ఎల్.ఎ

ఆయన పేరు రామాధర్ సింగ్. బీహార్‌లో బి.జె.పి పార్టీ తరఫున ఔరంగాబాద్ నియోజక వర్గం నుండి నాలుగుసార్లు ఎన్నికయిన ఎం.ఎల్.ఎ. 2010 లో ఎన్నికయ్యాక నితీష్ కుమార్ ప్రభుత్వంలో సహకార శాఖా మంత్రిగా పని చేస్తున్నాడు. ఈయన గురువారం మంత్రి పదవికి రాజీనామ చేశాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహా మేరకు గవర్నర్ ఆ ఎం.ఎల్.ఏ రాజీనామాని ఆమోదించాడు. మే 19న రాజీనామా చేశాక బీహార్ హై కోర్టు ఆయనను క్రింది కోర్టులో లొంగిపొమ్మని ఆదేశాలు ఇచ్చింది.…