హెలికాప్టర్ కుంభకోణం: గవర్నర్ల తొలగింపు బి.జె.పి మెడకు!
యు.పి.ఏ నియమించిన గవర్నర్లను తప్పించడానికి హెలికాప్టర్ల కుంభకోణాన్ని వేగవంతం చేసిన బి.జె.పి ప్రభుత్వం చివరికి సదరు కుంభకోణం ఎన్.డి.ఏ మెడకు చుట్టుకునే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి సలహా మేరకు పదవిలో కొనసాగుతున్న కాంగ్రెస్/యు.పి.ఏ గవర్నర్లు ఇద్దరినీ సి.బి.ఐ సాక్షుల హోదాలో ప్రశ్నించింది. తీరా విచారణ సందర్భంగా గవర్నర్లిద్దరూ ఎన్.డి.ఏ మొదటి పాలనలోనే హెలికాప్టర్ కుంభకోణానికి బీజం పడిన సంగతిని బైటికి తీయడంతో పరిస్ధితి తారుమారయింది. అగస్టా వెస్ట్ లాండ్ వి.వి.ఐ.పి హెలికాప్టర్ల…