బహుళజాతి కంపెనీల కోసం డబ్బులు కాసే కేన్సర్ చెట్లు

“డబ్బులు చెట్లకు కాయవు” ఇది మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఇష్టమైన నీతి సూత్రం. కానీ సాటి మనుషుల జబ్బులనే డబ్బు చెట్లుగా మార్చుకోగల బహుళజాతి కంపెనీల యజమానులు, వారికి యధాశక్తి తోడ్పడే డబ్బు జబ్బుల డాక్టర్లు మసలే పాడు లోకంలో డబ్బులు కుప్పలుగా కాసే కేన్సర్ తోటలు విరివిగా వర్ధిల్లుతున్నాయి. కేన్సర్ ఇప్పుడొక బడా వ్యాపారం అంటే తప్పేం లేదు. అటు ఉత్తర అమెరికా, యూరప్ ల నుండి ఇటు ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా…