ఔట్‌లుక్ ఇంటర్వూ: బి.జె.పిలో సుష్మా, జైట్లీ ల ఆధిపత్య పోరు

బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఔట్‌లుక్ వార పత్రిక తాజా సంచికకు ఇంటర్వూ ఇస్తూ ఇనప ఖనిజ అక్రమ తవ్వకాల్లో వేల కోట్లు కాజేసిన గాలి బ్రదర్సుకి కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి పదవులిచ్చి పైకి తేవడానికి బాధ్యతను బి.జె.పిలోని మరో నాయకుడు, రాజ్యసభలో బి.జె.పి నాయకుడూ ఐన అరుణ జైట్లీ పైకి నెట్టేసింది. బి.జె.పి పార్టీకి భావి నాయకులుగా భావిస్తున్న ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇలా బహిరంగంగా వేలెత్తి చూపించడం చర్చనీయాంశంగా మారింది. గాలి…

అమెరికా విషయంలో బిజెపి ది రెండు నాల్కల ధోరణి -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఇండియా, అమెరికాల అణు ఒప్పందంపై బిజేపి చేసిన తీవ్ర విమర్శలు నిజానికి అంత తీవ్రంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బిజేపి నాయకులే చెప్పిన సంగతిని అమెరికా రాయబారి కేబుల్ ద్వారా బయట పడింది. బిజేపి ది రెండు నాల్కల ధోరణి అనీ అమెరికాతో ఒప్పందాలపై బిజేపి ప్రకటించే వ్యతిరేకత అధికారం కోసమే తప్ప అందులో నిజం లేదని భారత దేశంలో ఎం.ఎల్ పార్టీలు చెప్పడం వాస్తవమేనని వికీలీక్స్ లీక్ చేసిన అమెరికా రాయబారుల కేబుళ్ళ ద్వారా ఇప్పుడు…