నితిన్ గడ్కారీ భవితవ్యం ఎటు వైపు? -కార్టూన్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండోసారి కూడా బి.జె.పి అధ్యక్షుడుగా ఎన్నిక కావాలని కోరుకుంటున్న గడ్కారీ ఆశలకు సాక్ష్యాత్తూ ఎల్.కె.అద్వానీ నుండే ప్రతిఘటన ఎదురవుతోంది. కొద్ది నెలల క్రితం ముంబైలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడి సహాయంతో రెండో పదవీకాలానికి అనుమతిని గడ్కారీ సంపాదించినప్పటికీ ఆ నిర్ణయం జాతీయ మహాసభలో ఆమోదం పొందవలసి ఉంది. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అద్వానీ ముంబైలోనే అలకపాన్పు ఎక్కాడు.…

బి.జె.పి లుకలుకలు: అధ్యక్షుడి పై అద్వానీ అసంతృప్తి?

బి.జె.పి లో లుకలుకలు గణనీయ స్ధాయికి చేరినట్లు ఆ పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.  బి.జె.పి జాతీయ కార్యవర్గం సమావేశాలు ముగిశాక గత శుక్రవారం ముంబైలో జరిగిన పార్టీ ర్యాలీలో అద్వానీ, సుష్మా పాల్గొనకపోవడం పై ఊహాగానాలు సాగుతుండగానే, అద్వానీ తన బ్లాగ్ ద్వారా తన అసంతృప్తిని మరోసారి వెళ్ళగక్కాడని ‘ది హిందూ’ తెలిపింది. అధ్యక్షుడు నితిన్ గడ్కారీ హయాంలో జరిగిన వివిధ తప్పులను ఎత్తిచూపుతూ పార్టీలో అంతర్మధనం అవసరమని అద్వానీ చెప్పినట్లు పత్రిక తెలిపింది.…

నా కొడుకుది రాజకీయ హత్య -ఐ.పి.ఎస్ అధికారి తండ్రి

మధ్య ప్రదేశ్ లో మైనింగ్ మాఫియా చేతిలో దారుణ హత్యకు గురయిన ఐ.పి.ఎస్ అధికారి నరేంద్ర కుమార్ ను రాజకీయ నాయకులే హత్య చేహించారని అతని తండ్రి, పోలీసు అధికారి కూడా అయిన కేశవ్ దేవ్ ఆరోపించాడు. కొద్ది రోజులుగా తాను అక్రమ మైనింగ్ కి సంబంధించిన ట్రక్కులను సీజ్ చేస్తున్నప్పటికీ రాజకీయ నాయకుల జోక్యంతో వదిలి పెడుతున్నారని తన కొడుకు చెప్పాడని ఆయన తెలిపాడు. రాజకీయ కుట్ర వల్లనే తన కొడుకు హత్యకు గరయ్యాడని కేశవ్…

మాయావతి పక్కనుంటే అవినీతి పరుడు, బి.జె.పి లోకి దూకితే ఒ.బి.సి నాయకుడు

భారతీయ జనతా పార్టీ అవినీతి వ్యతిరేకత మట్టి గొట్టుకుపోయింది. ఒ.బి.సిలకు నాయకుడని, ఓట్లు తెస్తాడనీ తాను నమ్మినందున, ఆయన బి.జె.పి తలుపు తట్టినందున అప్పటివరకూ అవినీతి మంత్రిగా ఉన్న వ్యక్తి కాస్తా వెనుకబడిన తరగతులకు నాయకుడుగా మారిపోయాడు. భారత దేశంలోని రాజకీయ పార్టీల అవినీతి వ్యతిరేకతలో నిజాయితీ నేతి బీరలో నెయ్యి చందమేనని రుజువు కావడం ఇది ఎన్నోసారో! లోక్ పాల్ చట్టం కోసం అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక పోరాటానికి భావోద్వేగాలతో మద్దతు పలికిన…