ల్యాప్ టాప్‌ విసిరేస్తూ, చెంప ఛెళ్ళుమనిపిస్తూ, పదవీవియోగ నైరాశ్యంలో యెడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బి.ఎస్.యెడ్యూరప్ప పదవీ వియోగంతోనో మరి దేనివల్లనో అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. బి.జె.పి మాజీ అధ్యక్షుడూ వెంకయ్య నాయుడు ల్యాప్ టాప్‌ లాక్కొని మరీ నేలకు విసిరికొట్టి ఆయనపై యెడ్యూరప్ప ఆగ్రహం ప్రకటించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇంటివద్ద తనను కలవడానికి వచ్చిన పార్టీ నాయకుడొకరిని చెంప ఛెళ్ళుమనిపించిన సంగతి కూడా ఆ పత్రిక వెల్లడించింది. ఇండియా టుడే కధనం ప్రకారం, యెడ్యూరప్ప తనకు మద్దతు…