2012 అసెంబ్లీ ఎన్నికలు: ఏ పార్టీనీ నమ్మని భారత ప్రజలు

భారత దేశ ప్రజలు తమ వద్దకు ఓట్లు అడగడానికి వచ్చిన ఏ పార్టీనీ నమ్మని పరిస్ధితికి చేరుకున్నారని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకున్నపుడు ఏదో ఒక పార్టీకి పట్టం కట్టినట్లు కనపడుతున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు ఒకే సమయంలో దేశవ్యాపితంగా ఒకే పార్టీని నమ్మే పరిస్ధితి ఇక రాకపోవచ్చన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ, అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలను తిరస్కరించడానికే పరిమితమవుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. అంటే…