ఫుకుషిమా: రేడియేషన్ రీడింగ్ తగ్గించి చూపిన కంపెనీలు

ఫుకుషిమా ప్రమాదం అనంతరం కర్మాగారంలో రేడియేషన్ విడుదల స్ధాయిని తగ్గించి చూపేందుకు కంపెనీ ప్రయత్నించిందని బి.బి.సి వెల్లడించింది. కర్మాగారంలో పని చేస్తున్న వర్కర్లకు అమర్చిన డొసి మీటర్లు వాస్తవ రేడియేషన్ స్ధాయిని చూపించకుండా ఉండేందుకు మీటర్లను లెడ్ కవచాలతో కప్పి ఉంచాలని కంపెనీ అధికారులు వర్కర్లకు ఆదేశాలిచ్చిన సంగతిని పత్రికలు వెల్లడి చేశాయి. వర్కర్లు నివాసం ఉండే డార్మీటరీలో కంపెనీ అధికారి ఒకరు ఆదేశాలిస్తుండగా వర్కర్లు సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఫుకుషిమా ప్రమాద తీవ్రతను…