రాముడు చెడ్డ బాలుడు -రాం జేఠ్మలాని
‘రాముడు మంచి బాలుడు’ అని చదవడమే ఇప్పటిదాకా మనకున్న అలవాటు. ఇకనుండి ‘రాముడు చెడ్డవాడు’ అనికూడా చదువుకోవచ్చు. బి.జె.పి రాజ్యసభ సభ్యుడు, జగన్ బెయిల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలం అయిన ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ రాం జేఠ్మలాని భారత ప్రజలకు ఆ అవకాశాన్ని కల్పించాడు. ఏ కారణంతో అయితే ఇన్నాళ్లూ ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారో సరిగ్గా అదే కారణంతో రాముడు తాజాగా చెడ్డవాడు కావడమే ఓ ఆసక్తికర పరిణామం. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలపై…
