బానిసత్వంలో 3 కోట్ల మంది, సగం ఇండియాలోనే

బానిస సమాజం అంతరించిందని గొప్పగా చెప్పుకుంటాం. అది నిజం కాదన్న చేదు నిజం మనం అంగీకరించాల్సిందే. వర్తమాన ప్రపంచంలో 3 కోట్ల మంది బానిసలుగా బతుకుతున్నారని ‘గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2013’ (జి.ఎస్.ఐ 2013) సర్వేలో తేలింది. గత సంవత్సరం సర్వే చేసిన ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’ (ఐ.ఎల్.ఓ) బానిస బతుకులు నెట్టుకొస్తున్నవారి సంఖ్య 2.1 కోట్లని తెలిపింది. వాస్తవం దానికంటే ఘోరమని జి.ఎస్.ఐ 2013 సర్వేలో స్పష్టం అయింది. ప్రపంచంలోని మొత్తం బానిసత్వంలో సగం బానిసత్వాన్ని…