సిరియా: అస్సాద్ జైత్రయాత్ర, హోమ్స్ పునఃస్వాధీనం
సిరియాలో పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టిన ఆల్-ఖైదా టెర్రరిస్టు మూకలు చావు దెబ్బలు తింటున్నాయి. తిరుగుబాటు పేరుతో వివిధ ముస్లిం టెర్రరిస్టు గ్రూపులు మొట్టమొదటిసారిగా విధ్వంసం ప్రారంభించిన హోమ్స్ నగరం ఇప్పుడు దాదాపు అస్సాద్ ప్రభుత్వం చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా హోమ్స్ లోని వివిధ ఉగ్రవాద శిబిరాలపై ప్రభుత్వ బలగాలు తీవ్ర స్ధాయిలో దాడులు చేయడంతో ఉగ్రవాదులు కాళ్ళ బేరానికి వచ్చి ప్రభుత్వంతో తాత్కాలిక సంధి కుదుర్చుకున్నారు. “ఇది మేము కోరుకున్నది కాదు. కానీ…