సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని బళ్ళారి మైనింగ్ మాఫియా, ఖనిజం సీజ్
మాఫియాకి తీర్పులు, ఆదేశాలు ఒక అడ్డా? కోర్టుల తీర్పులు, ప్రభుత్వాల ఆదేశాలే దానికి అడ్డయితే అది మాఫియా కాదేమో! గత గురువారం బళ్ళారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను, రవాణాను సస్పెండ్ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ బళ్ళారి నుండి 49 ట్రక్కులతో ఇనుప ఖనిజం రావాణా చేస్తూ బళ్ళారి వద్ద దొరికిపోయారు. బళ్ళారి శివార్లలో ఉన్న ఆలిఘర్ వద్ద ఇనుప ఖనిజాన్ని చట్ట విరుద్ధంగా రవాణా చేస్తుండగా జిల్లా…