అక్కడ హిందువులు, ఇక్కడ ముస్లింలు: మైనారిటీలకు ఎక్కడా రక్షణ లేదు
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే ఇండియాలో అయినా, మిలట్రీ కనుసన్నల్లో ఎదుగుతున్నపాకిస్ధాన్ నామమాత్ర ప్రజాస్వామ్యంలో అయినా మైనారిటీలకు ఎక్కడా రక్షణ లేదు. మైనారిటీ మతస్ధుల ఆస్తులు లాక్కోవడానికి మతం అడ్డు పెట్టుకునే దుర్మార్గాలు రెండు చోట్లా కొనసాగుతున్నాయని పత్రికల ద్వారా తెలుస్తున్నది. ‘రింకిల్ కుమారి’ కేసు ద్వారా పాక్ సుప్రీం కోర్టు కూడా మత ఛాందస శక్తుల ముసుగులో దాక్కున్న భూస్వామ్య పాలకవర్గాల చేతిలో బందీ అని స్పష్టం అయింది. ఫలితంగా తమ ఆస్తులను భక్షించడానికి జరుగుతున్న…
