ఆత్మాహుతి దాడిలో ఆఫ్గన్ మాజీ అధ్యక్షుడు హతం

ఆఫ్ఘనిస్ధాన్ మాజీ అధ్యక్షుడు బర్హనుద్దీన్ రబ్బాని ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం నియమించిన పీస్ కౌన్సిల్ కు నాయకత్వం వహిస్తున్న రబ్బానీ హత్యతో శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని ఆఫ్గన్ అధికారులతో పాటు వార్తా సంస్ధలు, పత్రికలు బాధపడుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్ధాన్, అమెరికా ప్రభుత్వాల అధికారులు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఆఫ్ఘనిస్ధాన్‌లో శాంతి నెలకొల్పే అవకాశం లేకుండా పోయిందన్నది వారి బాధ. అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో ఎందుకు శాంతి లేకుండా పోయిందో వీరు ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలకు…