ఉత్తర ఖండ్ వరదలు: తెలుగు దేశం ఖాతాలో క్రెడిట్స్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగానే స్పందించడం ద్వారా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం, వరద బాధితుల అభిమానం చూరగొన్నట్లు కనిపిస్తోంది. పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్ళి తెలియని చోట, తెలియని భాష మధ్య, తెలియని మనుషుల మధ్య పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న బాధితులకు కాసింత పలకరించే దిక్కు కనపడినా కొండంత ధైర్యం, నమ్మకం తెచ్చుకుంటారు. ఆ పని చేయడం ద్వారా తెలుగు దేశం పార్టీ తన పూర్వ వైభవం తెచ్చుకోవడంలో కొంత సఫలం…