అప్పు, లోటులతో దివాళా వాకిట అమెరికా ఆర్ధిక వ్యవస్ధ
ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ దివాళా వాకిట నిలబడి ఉంది. 2007-08 సంవత్సరాల్లో తలెత్తిన సంక్షోభం లాగానే మరో అర్ధిక సంక్షోభం ముంగిట వణుకుతూ నిలుచుంది. మరో ఆర్ధిక మాంద్యం (రిసెషన్) నుండి తప్పించుకోవడానికి అమెరికా కాంగ్రెస్, సెనేట్లలో రిపబ్లికన్లు, డెమొక్రట్లు సిగపట్లు పడుతున్నారు. బడ్జెట్ లోటును తగ్గించుకోవడానికీ, అప్పు పరిమితిని పెంచుకోవడానికి ఓ అంగీకారానికి రావడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. అప్పు పరిమితి పెంపుపై ఒబామా హెచ్చరికలు, బడ్జెట్ లోటు తగ్గింపుపై…